ఔటర్‌పై లారీ బోల్తా.. డ్రైవర్ మృతి | driver died in a lorry overturned incident | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై లారీ బోల్తా.. డ్రైవర్ మృతి

Nov 18 2016 9:13 AM | Updated on Sep 29 2018 5:26 PM

వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

శంషాబాద్: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హమీదుల్లానగర్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

గచ్చిబౌలి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ హమీదుల్లానగర్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement