గోదావరి నదిలో డ్రెడ్జింగ్‌ పనులకు బ్రేక్‌ | dredging work stoped in godavari | Sakshi
Sakshi News home page

గోదావరి నదిలో డ్రెడ్జింగ్‌ పనులకు బ్రేక్‌

Sep 25 2016 10:29 PM | Updated on Sep 4 2017 2:58 PM

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ రక్షిత ప్రాంతంలో పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన గోదావరి డ్రెడ్జింగ్‌ పనులను తాత్కాలికంగా ఆదివారం నిలుపుదల చేశారు. ఇటీవల చేపట్టిన డ్రెడ్జింగ్‌ పనులను ఆదివారం నిలిచిపోవడం పట్ల ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం ఇక్కడ పనులు తీరు తెన్నులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పరిశీల

  • పిచ్చుకలంలో తాత్కలికంగా పనులు నిలుపుదల 
  • బొబ్బర్లంక (ఆత్రేయపురం) : 
    ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ రక్షిత ప్రాంతంలో పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన గోదావరి డ్రెడ్జింగ్‌ పనులను తాత్కాలికంగా ఆదివారం నిలుపుదల చేశారు. ఇటీవల చేపట్టిన డ్రెడ్జింగ్‌ పనులను ఆదివారం నిలిచిపోవడం పట్ల ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  శనివారం ఉదయం ఇక్కడ పనులు తీరు తెన్నులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పరిశీలించారు. ఈ తరుణంలో డ్రెడ్జింగ్‌ పనులు నిర్వహిస్తుండగా పిచ్చుకలంకలో తుప్పలు, ముల్ల పొదలు అడ్డురావడం వల్ల తాత్కాలికంగా పనులు  నిలుపుదల చేసినట్లు తెలిసింది. ఇక్కడ ఓషియన్‌ పార్కు ఆధ్వర్యంలో రూ .16 కోట్లతో బ్యారేజీకి ఎగువ డ్రెడ్జింగ్‌ పనులు ప్రారంభించారు. దీనిపై  హెడ్‌ వర్క్స్‌ ఈఈ కృష్ణారావును వివరణ కోరగా ముళ్ల తుప్పలు, చెట్లు కారణంగా డ్రెడ్జింగ్‌ యంత్రాలు రిపేర్లు మరియు నిర్వహణ నిమిత్తం  హైదరాబాద్‌ పంపినందున తిరిగి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement