జిల్లా తైక్వాండో సబ్‌–జూనియర్‌ జట్ల ఎంపిక | district taiquando sub junior teams elect | Sakshi
Sakshi News home page

జిల్లా తైక్వాండో సబ్‌–జూనియర్‌ జట్ల ఎంపిక

Oct 25 2016 10:13 PM | Updated on Sep 4 2017 6:17 PM

ఈనెల 27న జిల్లా తైక్వాండో సబ్‌–జూనియర్‌ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా తైక్వాండో అధ్యక్షుడు గురుస్వామి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతసురం సప్తగిరి సర్కిల్‌ : ఈనెల 27న జిల్లా తైక్వాండో సబ్‌–జూనియర్‌ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా తైక్వాండో అధ్యక్షుడు గురుస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక స్థానిక ఇండోర్‌ స్టేడియంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందన్నారు. అండర్‌–11 కు చెందిన బాల, బాలికలు ఎంపికకు హాజరుకావాలని కోరారు.

ఇందులో మొదటి స్ధానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నవంబర్‌ 11 నుంచి 13 వరకు కాకినాడలో జరుగుతాయన్నారు. ఇతర వివరాలకు 7982440946 నంబరుకు సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement