జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు | ‍district players for national handball games | Sakshi
Sakshi News home page

జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Nov 3 2016 12:10 AM | Updated on Jun 2 2018 2:08 PM

సాయి స్పోర్ట్సు హాస్టల్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు.

కర్నూలు (టౌన్‌): సాయి స్పోర్ట్సు హాస్టల్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. వీరు బీహార్‌లోని పాట్నాలో జరుగునున్న జాతీయ స్థాయి జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు బుధవారం విలేకరులకు తెలిపారు. సెప్టెంబర్‌ 1, 2 తేదీలలో ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఇ. జగన్‌మోహన్‌రెడ్డి, ఎల్‌.ఎస్‌. ప్రదీప్, పి. లక్ష్మీ ప్రతాప్‌లు ప్రతిభ కనబరిచారని,  వీరిని ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు ఎంపిక చేశారన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement