జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే | district level chess winners | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే

Feb 13 2017 10:06 PM | Updated on Sep 5 2017 3:37 AM

జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే

జిల్లాస్థాయి చదరంగం విజేతలు వీరే

రాజమహేంద్రవరం సిటీ : జిల్లా స్థాయి చదరంగం పోటీల ఓపెన్, అండర్‌–15, 10 విభాగాల్లో 12 మంది విజేతలుగా నిలిచారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జి.వి.కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్‌ లో జరిగిన పోటీల్లో 140 మం

రాజమహేంద్రవరం సిటీ :  జిల్లా స్థాయి చదరంగం పోటీల ఓపెన్, అండర్‌–15, 10 విభాగాల్లో 12 మంది విజేతలుగా నిలిచారని జిల్లా చదరంగం సంఘం కార్యదర్శి జి.వి.కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం కాకినాడ గాంధీ భవన్‌ లో జరిగిన పోటీల్లో 140 మంది క్రీడాకారులు పోటీ పడ్డారన్నారు. ఓపెన్‌ విభాగంలో ఎం.చైతన్య, ఆర్‌.నరసింహ రవీంద్ర, ఎస్‌.సాయి గృహికేష్, ఎస్‌.బాలాజీరెడ్డి, అండర్‌ -15  బాలుర విభాగంలో సాయిసుహాస్‌, గౌతమ్, బాలికల విభాగంలో మాధుర్య, అమూల్య, అండర్‌ -10 బాలుర విభాగంలో జ్ఞానసాయి సంతోష్, మృత్యుంజయ, బాలికల విభాగంలో శ్రీవిద్యశాంభవి, వేదలత విజయం సాధించారని తెలిపారు. విజేతలకు రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వై.డి.రామారావు బహుమతులు అందజేశారన్నారు. అండర్‌ –9 విభాగంలో పోటీలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement