లేపాక్షిలో సందడే సందడి | devotees flow in lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షిలో సందడే సందడి

Jan 1 2017 11:30 PM | Updated on Sep 5 2017 12:08 AM

లేపాక్షిలో సందడే సందడి

లేపాక్షిలో సందడే సందడి

లేపాక్షికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ఆలయాల్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు.

లేపాక్షి : లేపాక్షికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ఆలయాల్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఏ మండపం చూసినా వందలాది మంది భక్తులు, యువకులు, విద్యార్థులతో నిండిపోయింది. ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, కల్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరులు, నాట్య మండపం, లతా మండపం, నంది విగ్రహం వద్ద పర్యాటకులు, భక్తులు ఫొటోలు తీయించుకోడానికి పోటీ పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement