'నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా' | develop narsannapeta as a ideal village, says kcr | Sakshi
Sakshi News home page

'నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా'

Oct 4 2015 5:21 PM | Updated on Sep 29 2018 4:44 PM

'నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా' - Sakshi

'నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా'

మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలోని నర్సన్నపేటను ఎర్రవల్లిలాగానే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.

జగదేవ్పూర్: మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలోని నర్సన్నపేటను ఎర్రవల్లిలాగానే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం నాడు మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన నర్సన్నపేటలో ఆగారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడుతూ.. త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు.

భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు నష్టం లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కేసీఆర్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement