భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో సోమవారం వేకువజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది.
చెలరేగిన దొంగలు
Aug 16 2016 1:03 AM | Updated on Sep 4 2017 9:24 AM
భీమవరం టౌన్: భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో సోమవారం వేకువజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై కె.సుధాకరరెడ్డి కథనం ప్రకారం.. అరటిపళ్లు వ్యాపారం చేసుకునే నూకల వెంకట పెద్దిరాజు ఆదివారం రాత్రి ఇంటి ఐరన్ గ్రిల్స్‌కు ఉన్న తలుపు వేయకుండా గెడపెట్టి నిద్రించారు. వేకువజామున 3.30 గంటల సమయంలో అలికిడి రావడంతో మేలుకోగా.. గుర్తుతెలియని వ్యక్తి ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు. పెద్దిరాజు లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది రూ.90 వేల నగదు, తొమ్మిది కాసుల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బాధితుడు పెద్దిరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొవ్వూరులో..
కొవ్వూరు : పట్టణంలో శ్రీనివాసపురం కాలనీలో బాతుల మల్లికార్జున ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈనెల 11న మల్లికార్జున ఇంటికి తాళాలు వేసి తన మామయ్యకు అనారోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. 14న పక్కింటి వాళ్లు ఫోన్ చేసి ఇంటి తాళాలు పగలకొట్టి ఉన్నాయని, బీరువాలో వస్తువులన్నీ బయటికి తీసినట్టు ఉన్నాయని చెప్పారు.
దీంతో అతను సోమవారం వచ్చి బీరువాలోని 26గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement