హాస్టల్‌ గదిలో మృతదేహం | dead body in hostel | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ గదిలో మృతదేహం

May 21 2017 12:22 AM | Updated on Sep 5 2017 11:36 AM

పరిగి(పెనుకొండ) : పరిగిలోని సాంఘిక సంక్షేమ వసతి గహం (హాస్ట ల్‌) గదిలో గుర్తు తెలియని ఓ వద్ధుడి(60) మృతదేహాన్ని శనివారం కనుగొన్నట్లు ఎస్‌ఐ అంజనయ్య తెలిపారు. హాస్టల్‌ లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. వెంటనే తమ సిబ్బందితో అక్కడికెళ్లి చూడగా..

పరిగి(పెనుకొండ) : పరిగిలోని సాంఘిక సంక్షేమ వసతి గహం (హాస్ట ల్‌) గదిలో గుర్తు తెలియని ఓ వద్ధుడి(60) మృతదేహాన్ని శనివారం కనుగొన్నట్లు ఎస్‌ఐ అంజనయ్య తెలిపారు. హాస్టల్‌ లోపలి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. వెంటనే తమ సిబ్బందితో అక్కడికెళ్లి చూడగా.. మృతదేహం ఉందన్నారు. అయితే బాగా ఉబ్బిపోయి ఉండడంతో గుర్తు పట్టేందుకు కూడా వీల్లు కాలేదన్నారు. మతుడు ఇదే ప్రాంతంలో పగలంతా భిక్షాటన చేసి, రాత్రిళ్లు హాస్టల్‌కు వచ్చి నిద్రపోయేవాడని పేర్కొన్నారు. రెం డు, మూడు రోజుల కిందట చనిపోయి ఉంటాడని, అది అనారోగ్యంతో అయి ఉంటుందని భావిస్తున్నారు. 

గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో...
గుత్తి(గుంతకల్లు) : గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. మతుడు ఎవరైందీ తెలియరాలేదన్నారు. అతని వయస్సు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని వివరించారు. వారం రోజులుగా ఆర్టీసీ బస్టాండ్‌ పరిసరాల్లో సంచరిస్తుండేవాడని స్థానికులు చెప్పారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకని విచారిస్తున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement