కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రతి రోజు బోటింగ్ | daily boating at kotpalli project | Sakshi
Sakshi News home page

కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రతి రోజు బోటింగ్

Jul 25 2016 6:04 PM | Updated on Apr 3 2019 5:26 PM

కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రతి రోజు బోటింగ్ - Sakshi

కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రతి రోజు బోటింగ్

కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఇకనుంచి ప్రతి రోజు పర్యాటకులకు బోటింగ్ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టులోకి 19 అడుగుల వరకు వర్షపునీరు చేరడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు రోజు రావడంతో ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు.

ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఇకనుంచి ప్రతి రోజు పర్యాటకులకు బోటింగ్ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టులోకి 19 అడుగుల వరకు వర్షపునీరు చేరడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు రోజు రావడంతో ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో భారీగా నీరుందని కొంతమంది గాలాలతో చేపలు పడుతున్నారు. యువతీ, యువకులు నీటిలో ఈత కొట్టడం, పాటలు పాడతూ, డాన్సులు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కొందరు యువకులు ఈ ప్రాంతంలో ఓ షార్ట్‌ ఫిలీంలో బాగంగా ఓ పాటను పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement