
అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ నంబర్ వన్
అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని, హామీల అమలులో ఆయన విఫలమవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
చొప్పదండి: అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని, హామీల అమలులో ఆయన విఫలమవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్రాభివృద్ధి’ పేరుతో చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారం కరీంనగర్ జిల్లా చొప్పదండికి చేరుకుంది. చొప్పదండిలోని చర్చి లో క్రిస్‌మస్ వేడుకల్లో పాల్గొన్న తమ్మినేని దారి వెంట స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ఎన్నికల హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. డబు ల్ బెడ్రూం ఇళ్ల వ్యయం కంటే ప్రకటనల ఖర్చే పెరిగిపోతోందన్నారు. పాదయాత్రలో రాష్ట్ర కా ర్యవర్గ సభ్యుడు సుదర్శన్‌రావు, నాగేశ్వర్‌రావు, గోపాల్, జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, వర్ణ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.