జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అ భ్యర్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత శిక్షణ ఇవ్వన్నుట్టు గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి లె లిపారు.
జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు శిక్షణ
Aug 17 2016 11:21 PM | Updated on Sep 4 2017 9:41 AM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అ భ్యర్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత శిక్షణ ఇవ్వన్నుట్టు గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయవరపు శ్రీరామ్మూర్తి లె లిపారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు 45 రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని చెప్పారు. శిక్షణకు హాజర య్యే అభ్యర్థుల దరఖాస్తులు వంద దాటితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. ఇప్పటికే రూ.20 లక్షల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలు కొనుగోలు చేశామని, మరో రూ.60 లక్షల పుస్తకాలు త్వరలో కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేస్తామని, ఈ–లైబ్రరీలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. 14 గ్రంథాలయాలకు రూ. 171.25 లక్షలతో మరమ్మతులు , నూతన భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఇంజినీరింగ్ శాఖకు సొ మ్ము చెల్లించామన్నారు. వేల్పూరు, నరసాపురంలో శాఖా గ్రంథాలయాల కోసం త్వరలో భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఉప గ్రంథ పాలకులు డి.వెంకటరమణ, జిల్లా కేంద్ర గ్రంథాలయం అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఎల్.వెంకటేశ్వరరావు, సమన్వయ కర్త పి.గిరిబాబు పాల్గొన్నారు
Advertisement
Advertisement