నంద్యాల తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులు చెత్తలో వేసిన సంఘటనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి చింతలపల్లె సుధాకర్ రావు తెలిపారు.
అధిష్టానానికి ఫిర్యాదు
Oct 13 2016 11:55 PM | Updated on Aug 10 2018 8:23 PM
నూనెపల్లె: నంద్యాల తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులు చెత్తలో వేసిన సంఘటనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి చింతలపల్లె సుధాకర్ రావు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ ఇన్‌చార్జి శిల్పామోహన్ రెడ్డి ఇంటి సమీపంలో చెత్త బుట్టలో టీడీపీ సభ్యుత్వ కార్డులు పడేయడం పార్టీని అగౌరవపరచడమే అన్నారు. 2014లో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించగా కాంగ్రెస్ నుంచి శిల్పా టీడీపీలోకి చేరారని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు నమోదు ప్రక్రియ శిల్పా చేపట్టారన్నారు. అప్పటి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మొత్తం సభ్యుత్వ కార్డులు శిల్పా చేతికే అందించారని గుర్తు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి ఫరూక్ 8వేలకు పైగా సభ్యత్వం చేశారని, వాటిని శిల్పాకే ఇవ్వడమే చెత్త పాలు చేశారన్నారు.
Advertisement
Advertisement