కల్యాణ వైభోగమే.. | communal marriages godisalapalli | Sakshi
Sakshi News home page

కల్యాణ వైభోగమే..

Apr 7 2017 11:43 PM | Updated on Sep 5 2017 8:11 AM

కల్యాణ వైభోగమే..

కల్యాణ వైభోగమే..

గొడిశలపల్లిలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు రామన్న తనయుడు హనుమంతరెడ్డి 16 జంటలకు ఆంజనేయస్వామి ఆలయం వద్ద సామూహిక వివాహాలు నిర్వహించారు.

డి.హీరేహాళ్ : గొడిశలపల్లిలో సీతారాముల కల్యాణోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు రామన్న తనయుడు హనుమంతరెడ్డి 16 జంటలకు ఆంజనేయస్వామి ఆలయం వద్ద సామూహిక వివాహాలు నిర్వహించారు. హనుమంతరెడ్డి నూతన వధూవరులకు పెళ్లి వస్త్రాలతో పాటు మంగళ సూత్రాలను అందించారు.

కర్ణాటకలోని కురుగోడు మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణరెడ్డి తనయుడు భరత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వివాహాలకు హాజరైన వధూవరుల బందువులకు భోజన వసతి కల్పించారు. కార్యక్రమానికి తహసీల్దార్‌ మారుతి, టీడీపీ నాయకులు ఆనందరెడ్డి, మోహనరెడ్డి, అంగడి రాజశేఖర్, మాజీ ఎంపీపీ పుష్పావతి, మహాబలిలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement