వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | collector visited DMHO office | Sakshi
Sakshi News home page

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Dec 17 2016 2:09 AM | Updated on Mar 21 2019 8:35 PM

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు - Sakshi

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

నెల్లూరు(అర్బన్‌): డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ముత్యాలరాజు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాత్రి స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రోగ్రాం ఆఫీసర్లు, అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

 

 

  • కలెక్టర్‌ ముత్యాలరాజు

నెల్లూరు(అర్బన్‌):  డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ముత్యాలరాజు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాత్రి స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రోగ్రాం ఆఫీసర్లు, అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలందించడంలో పీహెచ్‌సీలు ఫర్‌ఫార్మెన్స్‌ సాధించాల్సిందేనన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులను 100శాతం చేయాలని కోరారు. గర్భిణులకు తగిన మందులు, టీకాలు సకాలంలో అందజేయాలన్నారు. మాతా, శిశు మరణాలను అరికట్టాలన్నారు. ప్రతి వారం ప్రోగ్రాం అధికారులు పీహెచ్‌సీలను తనిఖీ చేసి పూర్తి స్థాయిలో సేవలపై తనకు డీఎంహెచ్‌ఓ ద్వారా  నివేదిక ఇవ్వాలని కోరారు ఎన్‌ఆర్‌హెచ్‌ఎం బడ్జెట్‌పై సమీక్షించారు. మందుల కొరత రాకుండా చూసుకోవాలని, ముందుగానే తగిన ఇండెంట్‌ పెట్టుకోవాలని సూచించారు. రెండు వారాలకోసారి కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్లు, లెప్రసీ అధికారి, క్షయనివారణ అధికారి తదితర అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఈ సమావేశాల్లో కచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో డీఎల్‌ఓ డాక్టర్‌ రమాదేవి, క్షయనివారణ అధికారి సురేష్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement