ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల ఆరున జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల ఆరున జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.50కి హెలికాప్టర్‌లో ధర్మవరం చేరుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బుక్కరాయసముద్రం చేరుకుని.. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభిస్తారు. తర్వాత సమీపంలోని కేజీబీవీలో రైతు ఉత్పత్తిదారుల సంఘం సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వెళతారు.