హోదాపై బాబు వ్యాఖ్యలు బాధాకరం | cm statement wrong.. | Sakshi
Sakshi News home page

హోదాపై బాబు వ్యాఖ్యలు బాధాకరం

Sep 27 2016 11:29 PM | Updated on Mar 23 2019 9:10 PM

హోదాపై బాబు వ్యాఖ్యలు బాధాకరం - Sakshi

హోదాపై బాబు వ్యాఖ్యలు బాధాకరం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఓ హక్కుగా భావించి పోరాడుతున్న విద్యార్థులను జైళ్లకు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడం బాధాకరమని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను   
విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్‌) : 
  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఓ హక్కుగా భావించి పోరాడుతున్న విద్యార్థులను జైళ్లకు పంపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడం బాధాకరమని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను పేర్కొన్నారు. గాంధీనగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే తన రక్తం ఉడికిపోతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ‘ప్యాకేజీ’ చాలని మాటమార్చడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ ప్యాకేజీ కమీషన్ల కోసం 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీÄñæ¬ద్దని విజ్ఞప్తి చేశారు. నాడు ‘క్విట్‌ ఇండియా’తో బ్రిటీష్‌ వారిని ఎలా తరిమికొట్టారో.. నేడు చంద్రబాబును కూడా రాష్ట్ర ప్రజలు ‘క్విట్‌ ఏపీ’తో తరిమికొట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఎంతమందిని జైల్లో పెడతారు.. నిజంగా అలా జైల్లో పెట్టాలనుకుంటే ప్రత్యేక హోదా కోసం పోరాడేవారితో రాష్ట్రంలో జైళ్లు సరిపోవని పేర్కొన్నారు. రెండేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. మొన్నటికి మొన్న చింతమనేని ప్రభాకర్‌ తహసీల్దారును కొట్టి బెదిరిస్తే.. ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించడం సిగ్గుచేటని విమర్శించారు. అవినీతి పాలనకు అంతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మంత్రి పీతల సుజాత ఇంట్లో పది లక్షల రూపాయల సూట్‌ కేసును పోలీసులు పట్టుకున్నా కేసు కట్టలేని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement