కళ్లల్లో కారం కొట్టి.. | Chilli .. struck eyes .. | Sakshi
Sakshi News home page

కళ్లల్లో కారం కొట్టి..

Jul 29 2016 11:16 PM | Updated on Sep 4 2017 6:57 AM

కళ్లల్లో కారం కొట్టి..

కళ్లల్లో కారం కొట్టి..

ఓ వృద్ధురాలి కళ్లలో కారం పొడి కొట్టి మెడలోని బంగారు తాళిబొట్టు సరుడును ఇద్దరు దొంగలు లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం సాయంత్రం మండలంలోని ఖాదర్‌పల్లె రోడ్డులో చోటు చేసుకుంది.

చాపాడు:
ఓ వృద్ధురాలి కళ్లలో కారం పొడి కొట్టి మెడలోని బంగారు తాళిబొట్టు సరుడును ఇద్దరు దొంగలు లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం సాయంత్రం మండలంలోని ఖాదర్‌పల్లె రోడ్డులో చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పల్లవోలుకు చెందిన బాలమ్మ పొలంలో వేసిన నారుమడిని చూసేందుకు ఖాదర్‌పల్లె రోడ్డుపై మూడో మోరి వద్ద వెళ్తుండగా, ఖాదర్‌పల్లె నుంచి వస్తున్న ఇద్దరు దుండగులు ఆమెతో మాటలు కలిపారు. దగ్గరికి రాగానే కళ్లలో కారంపొడి చల్లారు. ఆమె తేరుకోకముందే మెడలో ఉన్న రూ.1.35 లక్షల విలువ చేసే 4.50 తులాల బంగారు తాళిబొట్టు సరుడును లాక్కెళ్లారు. ఈ క్రమంలో తాళిబొట్టు బిళ్లలు అక్కడే పడిపోయాయి. వాటిని ఆమె తీసుకున్నారు. వారిని చూస్తే గుర్తిస్తానని బాలమ్మ చెబుతోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివశంకర్‌ తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement