తల్లి అనారోగ్యానికి సంబంధించిన మాత్రలు మింగి సుస్మిత(3) అనే చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలోని రామగిరిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
చిన్నారి మృతి
Oct 18 2016 1:39 AM | Updated on Sep 28 2018 3:41 PM
పామిడి : తల్లి అనారోగ్యానికి సంబంధించిన మాత్రలు మింగి సుస్మిత(3) అనే చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలోని రామగిరిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. సుస్మిత లేపాక్షి, భాగ్యమ్మ దంపతుల కుమార్తె. ఇటీవల తీవ్ర జ్వరం, తలనొప్పికి గురైన భాగ్యమ్మ ఆరోగ్యకార్యకర్తలతో మాత్రలు తీసుకుని ఇంట్లో పెట్టింది. ఆమె ఇంటి బయట పొరుగింటి వారితో మాట్లాడుతుండగా, ఆ మాత్రలను సుస్మిత మింగేసింది. అపస్మారక స్థితిలో ఉన్న పాపను చూసిన తల్లి హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పని నిమిత్తం వేరే ఊరెళ్లిన పాప తండ్రి లేపాక్షి హుటాహుటినా పామిడికి చేరుకున్నాడు. పాప మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేక సొమ్మసిల్లిపడిపోయాడు. అభం శుభం తెలియని చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement