జోగుళాంబ ఘాట్‌ పరిశీలన | Check in jogulamba ghot | Sakshi
Sakshi News home page

జోగుళాంబ ఘాట్‌ పరిశీలన

Aug 4 2016 12:58 AM | Updated on Sep 4 2017 7:40 AM

కృష్ణా పుష్కరాల్లో భాగంగా మండలంలోని గొందిమల్లలో నిర్మిస్తున్న జోగుళాంబ ఘాట్‌ను డీఎస్పీ బాలకోటి బుధవారం పరిశీలించారు. ఈనెల 12న కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ ఇక్కడికి రానున్నారు. 11వ తేదీ రాత్రి అలంపూర్‌లో బసచేసి మరుసటిరోజు తెల్లారుజామున జోగుళాంబ ఘాటులో పుష్కర స్నానం చేయనున్నారు.

12న కృష్ణా పుష్కరాలు, ప్రారంబోత్సవానికి సీఎం కేసీర్‌
అలంపూర్‌ : కృష్ణా పుష్కరాల్లో భాగంగా మండలంలోని గొందిమల్లలో నిర్మిస్తున్న జోగుళాంబ ఘాట్‌ను డీఎస్పీ బాలకోటి బుధవారం  పరిశీలించారు. ఈనెల 12న కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ ఇక్కడికి రానున్నారు. 11వ తేదీ రాత్రి అలంపూర్‌లో బసచేసి మరుసటిరోజు తెల్లారుజామున జోగుళాంబ ఘాటులో పుష్కర స్నానం చేయనున్నారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మశ్వరస్వామివార్లను దర్శించుకోనున్నారు. ఈ ఆలయాల వరకు బందోబస్తు నిమిత్తం డీఎస్పీ పరిశీలించారు. సుమారు 10కి.మీ. మేర సుమారు 800మంది పోలీసులు అవసరముంటుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పర్వతాలు పాల్గొన్నారు.
 

Advertisement

పోల్

Advertisement