బ్యాంకు వద్ద వృద్ధుడికి టోకరా | cheating unnown person | Sakshi
Sakshi News home page

బ్యాంకు వద్ద వృద్ధుడికి టోకరా

Aug 4 2016 12:38 AM | Updated on Sep 4 2017 7:40 AM

జీలుగుమిల్లి : మండలంలోని దర్భగూడెంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో బుధవారం ఓ వృద్ధుడి నుంచి రూ.14వేల 500లను ఓ అగంతకుడు చోరీ చేశాడు.

జీలుగుమిల్లి : మండలంలోని దర్భగూడెంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో బుధవారం ఓ వృద్ధుడి నుంచి రూ.14వేల 500లను ఓ అగంతకుడు చోరీ చేశాడు. ఈ చోరీపై హెడ్‌కానిస్టేబుల్‌ ఇరపం భాస్కర్‌ కథనం ప్రకారం.. దర్బగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి సయ్యద్‌ నన్నా సాహెబ్‌  తన పింఛన్‌ డబ్బు తీసుకోవాడానికి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దర్బగూడెం శాఖకు బుధవారం ఉదయం వెళ్లాడు. బ్యాంకులో రూ.14.500లు సొమ్ము డ్రాచేసుకుని బయటకు వస్తుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి మిమ్మలి క్యాషియర్‌ పిలుస్తున్నారని చెప్పాడు. వృద్ధుడు వెనుకకు తిరిగి కౌంటర్‌ వైపు వెళ్తుండగా సంచిలో ఉన్న సొమ్మును పట్టుకుని ఉడాయించాడు. ఈ విషయంపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement