మద్యం దొరకక ఆత్మహత్య | an old man committed suicide due to alchohal | Sakshi
Sakshi News home page

మద్యం దొరకక ఆత్మహత్య

Jan 3 2016 10:12 PM | Updated on Nov 6 2018 7:56 PM

కల్తీ కల్లు లభించకపోవడం.. ఇంట్లో కుటుంబ సభ్యులు మద్యాన్ని మానాలని ఒత్తిడి తేవడంతో మనస్తాపం చెందిన ఓ వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజేంద్రనగర్(రంగారెడ్డి): కల్తీ కల్లు లభించకపోవడం.. ఇంట్లో కుటుంబ సభ్యులు మద్యాన్ని మానాలని ఒత్తిడి తేవడంతో మనస్తాపం చెందిన ఓ వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్వాడ ప్రాంతానికి చెందిన సత్తయ్య(75) కల్తీకల్లుకు అలవాటు పడ్డాడు.

అయితే, కొన్ని రోజులుగా కల్తీకల్లు దొరకడం లేదు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు కల్లు తాగవద్దంటూ ఒత్తిడి తెస్తున్నారు. అటు కల్లు దొరకకపోవడంతోపాటు కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో రెండు, మూడు రోజులుగా ఒత్తిడికి లోనయ్యాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement