రెడ్డి సంక్షేమ సంఘం ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన పెద్దకోట్ల చంద్రమోహనరెడ్డి ఎంపికయ్యారు.
అనంతపురం కల్చరల్ : రెడ్డి సంక్షేమ సంఘం ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన పెద్దకోట్ల చంద్రమోహనరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గంగుల కుంట నరేష్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరించారు. ఈనెల 25న జిల్లాలో జరిగే ఓ సభలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు.
ఏపీ రెడ్డి సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన తొలిసారే తాడిమర్రి మండలం పెద్దకోట్లకు చెందిన ఐటీ నిపుణులు, పీసీఎంఆర్ ట్రస్టు నిర్వాహకులు చంద్రమోహనరెడ్డి ఎంపిక కావడంపై రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.