ఏలూరు(సెంట్రల్): ‘నాట్లు వేశాం.. పంట రుణాలు ఇవ్వండి’ నినాదంతో ఈనెల 10న కౌలురైతుల చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్టు కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక అన్నే భవన్‌లో బుధవారం చలో కలెక్టరేట్‌కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
చలో కలెక్టరేట్ కరపత్రాలు విడుదల
Aug 3 2016 6:35 PM | Updated on Jul 12 2019 4:35 PM
ఏలూరు(సెంట్రల్): ‘నాట్లు వేశాం.. పంట రుణాలు ఇవ్వండి’ నినాదంతో ఈనెల 10న కౌలురైతుల చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్టు కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక అన్నే భవన్‌లో బుధవారం చలో కలెక్టరేట్‌కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. భూ యజమానుల అంగీకారంతోనే కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చట్టవిరుద్ధమని, జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉండగా 2.98 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చామని అధికారులు ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి విరుద్ధంగా ఉందన్నారు. అనర్హులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారని, జిల్లాలో 95 శాతం మంది భూయజమానులు పంట రుణాలు తీసుకుంటున్నారని శ్రీనివాస్ అన్నారు. పంట బీమా కౌలురైతులకే వర్తింపజేయాలని, ఈ–క్రాప్ బుకింగ్‌లో కౌలురైతుల పేర్లనే నమోదు చేసి, ఇటీవలే కురిసిన వర్షాలకు నారుమళ్లు, నాటు వేసిన పొలాలు దెబ్బతిని నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘం నాయకులు పల్లపోతు రెడ్డియ్య, పైడిపాటి భాస్కరరావు, బండి రత్తయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement