మండలంలోని ఛాగల్లు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొన్నా రమేష్(38) ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులతోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఛాగల్లులో ఉరివేసుకొని ఇద్దరి ఆత్మహత్య
Aug 22 2016 12:17 AM | Updated on Sep 4 2017 10:16 AM
స్టేషన్ ఘన్‌పూర్ టౌన్ : మండలంలోని ఛాగల్లు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొన్నా రమేష్(38) ఆదివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఆర్థిక ఇబ్బందులతోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.
తల్లిదండ్రులు మందలించడంతో..
ఛాగల్లు గ్రామానికి చెందిన మునిగాల యమున(21)కు ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా పెళ్లయిన నాటి నుంచి యమున తన పుట్టిం టి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం భర్త వద్దకు కాపురానికి వెళ్లాలంటూ ఆమెను తల్లిదండ్రులు మందలించారు. ఈనేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Advertisement


