కారు బోల్తా: ఇద్దరు మృతి | car accident, two people dead | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఇద్దరు మృతి

Jan 24 2016 7:36 PM | Updated on Apr 3 2019 7:53 PM

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తూ.. డివైడర్‌ను ఢీకొని బ్రిడ్జి మీద నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో కొత్తూరు మండలం ఇనుముల్‌నర్వ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement