సెల్‌ఫోన్ బదులు మహాలక్ష్మి యంత్రం | call booking fraud: ponnaluru man get mahalaxmi yantra instead phone | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ బదులు మహాలక్ష్మి యంత్రం

Feb 3 2016 2:29 PM | Updated on Sep 3 2017 4:53 PM

సెల్‌ఫోన్ బదులు మహాలక్ష్మి యంత్రం

సెల్‌ఫోన్ బదులు మహాలక్ష్మి యంత్రం

కాల్ బుకింగ్ ద్వారా శ్యాంసంగ్ ఎ7 సెల్‌ఫోన్ కొన్న వినియోగదారుడికి ఓ పెట్టెలో మహాలక్ష్మి యంత్రం రావడంతో అవాక్కయ్యాడు.

పొన్నలూరు: కాల్ బుకింగ్ ద్వారా శ్యాంసంగ్ ఎ7 సెల్‌ఫోన్ కొన్న వినియోగదారుడికి ఓ పెట్టెలో మహాలక్ష్మి యంత్రం రావడంతో అవాక్కయ్యాడు. ప్రకాశం జిల్లా పొన్నలూరుకు చెందిన నూకల విజయచైతన్యకు ఢిల్లీకి చెందిన శ్రీనవదుర్గ సంస్థాన్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. సెల్‌ఫోన్ బుక్ చేసుకుంటే తక్కువ ధరకే అందిస్తామని నెల రోజులుగా ఫోన్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయచైతన్య శ్యాంసంగ్ ఎ7 సెల్‌ఫోన్‌ను రెండు రోజుల కిందట బుక్ చేశాడు.

మంగళవారం శ్రీనవదుర్గ సంస్థాన్ కంపెనీ వారు పోస్టులో సెల్‌ఫోన్ పంపించామని ఫోన్ చేశారు. దీంతో విజయచైతన్య స్థానిక పోస్టాఫీసుకు వెళ్లి రూ.3,400 చెల్లించి పార్శిల్ బాక్స్‌ను ఇంటికి తెచ్చి తెరచి చూడగా మహాలక్ష్మి యంత్రం కనిపించింది. దీంతో కంపెనీ వారికి ఫోన్ చేస్తే తమాషాగా మాట్లాడారని విజయచైతన్య వాపోయారు. తనకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement