కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

cable operators requests in grievance - Sakshi

జిల్లాగ్రీవెన్స్‌ సెల్‌లో వినతి

వినతి పత్రాలు స్వీకరించిన కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఎక్కువగా వ్యక్తిగత వినతులు అందాయి. కార్యక్రమంలో జేసీ కె.వి.ఎన్‌.చక్రధరబాబు, జేసీ–2 పి.రజనీకాంతారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అందిన వినతులు కొన్ని పరిశీలించగా...

కేబుల్‌ ఆపరేటర్లకు ఏపీఎస్‌ ఫైబర్‌ లిమిటెడ్‌ కనెక్షన్‌ ఇవ్వాలని, కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం జరగకుండా చూడాలని రణస్థలం మండలానికి చెందిన కే బుల్‌ ఆపరేటర్లు లంక రమణ, జి.జనా ర్దనరావు, కె.గణపతిరావు, ఎస్‌.ఖాన్, ఎస్‌.సూర్యనారాయణ తదితరులు వినతి పత్రం అందించారు.
తనకు రేషన్‌ కార్డు, ఆధాఆర్‌ కార్డు, ఇల్లు స్థలం ఉన్నా పక్కా ఇల్లు మం జూరు చేయడం లేదు. పలుమార్లు ప్రజాపతినిధులను, అధికారులను కోరి నా ఫలితం లేదు. తనకు ఇల్లు మం జూరు చేయాలని రేగిడి మండలంలోని బూరాడ గ్రామానికి చెందిన వంజరాపు రమేష్‌ కోరారు.
ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చినా, సంతకవిటి మండలంలోని మందరాడ, కాకరాపల్లి, చేనేత సొసైటీకి రుణం మాఫీ కావడం లేదని, అక్కడ బ్యాంకర్లు సహకరించడం లేదని ఆ సొసైటీ సభ్యులు ఎన్‌.ధర్మారావు, బి.సత్యం, కె.మహేష్, కె.నీలయ్య తదితరులు కోరారు.
శ్రీకాకుళం నగరంలోని పశు సంవర్థ క శాఖ జేడీ కార్యాలయం ప్రాంగణంలో గత 30 సంవత్సరాలుగా చెప్పులు కుట్టికొని, చిల్లర వ్యాపారాలు చేనుకొని చిరు దుకాణాలు నడుపుకుంటూ జీవి స్తున్నాం. అయితే అక్కడ కమర్షియల్‌ కాం ప్లెక్స్‌ను నిర్మించారని, అందులో తమకు షాపులు ఇవ్వాలని అన్నారు. అయితే అధికార పార్టీ నాయకులు ఈ షాపులను అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నట్టు తెలుస్తోందని, దీనిపై అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కె.శంకరరావు, ఎం.వెంకట్రావు, వి.శంకరరావు తదితరులు కోరారు.
జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో ముఖలింగేశ్వర దేవాల యం అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతా న్ని పర్యటక రంగంలోకి తీçసుకొని అన్ని వసతులు కల్పించాలని, భక్తులకు వస తి గృహాలు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆ గ్రామానికి చెందిన నాయుడుగారి రాజశేఖర్‌ వినతి పత్రం అందించారు.
జిల్లాలోని తహసీల్దారు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు శిక్షణ పొందిన లైసెన్సుడు సర్వేయర్లు 78 మంది పనిచేస్తున్నారని, వీరికి ఇప్పటివరకు జీతాలు, గౌరవ వేతనం లేదని, ఇకనుంచైనా గౌరవ వేతనం కల్పించాలని సీహెచ్‌ ధనరాజ్, కమల్, సీతామహాలక్ష్మి, శరణ్య, రాజు, శ్రీను తదితరులు కోరారు.
ఒకే మరుగుదొడ్డికి రెండు సార్లు బిల్లులు చేశారని, గతంలో ఒకరి పేరిట ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద, రెండో సారి మరొకరి పేరిట స్వచ్ఛ భారత్‌ కింద బిల్లులు పెట్టి చెల్లింపులు చేసి సంబంధిత శాఖ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని లావేరు మండలంలోని నక్కపేట గ్రామానికి చెందిన కొన్ని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top