బొగ్గుయార్డులో లారీ క్లీనర్‌ సజీవ సమాధి | Sakshi
Sakshi News home page

బొగ్గుయార్డులో లారీ క్లీనర్‌ సజీవ సమాధి

Published Sun, Oct 2 2016 1:12 AM

బొగ్గుయార్డులో లారీ క్లీనర్‌ సజీవ సమాధి

 
గణపురం :మండలంలోని చెల్పూరు శివారులోని కేటీపీపీలోని బొగ్గుయార్డ్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో లారీ క్లీనర్‌  దర్శనాల సమ్మోదర్‌(23) సజీ వ సమాధి అయ్యాడు. భూపాలపల్లిలోని రాంనగర్‌లో నివాసముం టున్న సింగరేణి కార్మికుడు దర్శనాల వెంకటయ్య, విమల దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వారి లో ఒక కుమారుడైన సమ్మోదర్‌ బొగ్గు లారీపై క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భూపాలపల్లి నుంచి లోడుతో కేటీపీపీకి వచ్చిన రెండు లారీలు యార్డ్‌లో బొగ్గును డంపు చేస్తున్న సమయంలో సమ్మోదర్‌పై బొగ్గుపడింది. ఈ విషయాన్ని రెండు లారీల డ్రైవర్లు గమనించలేదు. డంపు చేసిన తర్వాత క్లీనర్‌ కోసం వెతకగా కనిపించలేదు. అతడి కోసం అరగంట సేపు వెతికారు. తర్వా త అనుమానం వచ్చి అక్కడ డంపు చేసిన బొగ్గును ప్రొక్లయిన్తో తోడగా ముక్కలుముక్కలుగా సమ్మోదర్‌ మృ తదేహం బయటపడింది. తల కనిపిం చలేదు. ప్రమాదానికి కారణమైన లారీలు వేర్వేరు ట్రా¯న్పోర్టులకు సం బంధించినవి. బొగ్గు డంపు చేసే సమయంలో యార్డ్‌కు సంబంధించిన  అధికారులు లేకపోవడంతో సంఘటన సమాచారం కచ్చితంగా తెలి యడం లేదు. పోలీసులు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఎస్‌సై  ప్రవీన్కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య మంజుల, నాలుగు నెలల కూతురు పాప ఉన్నారు. 
మృతుడి కూతురు పరిస్థితి విషమం
సంఘటన స్థలంలో సమ్మోదర్‌ మృతదేహంపై పడి భార్యతోపాటు తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగి లేలా విలపించారు. సుమారు నాలు గు నెలలు కూడా నిండని అతడి కూతురికి ఫిట్స్‌ వచ్చాయి. దీంతో గాబరా పడ్డా బంధువులు చేతిలో ఇనుప వస్తువు పెట్టి కాళ్లు చేతులు మర్దన చేశారు. భర్త మరణం, కూతురి పరిస్థితిని చూసి మంజుల బోరున విలపించింది. పాపను స్థానిక అస్పత్రికి తరలించారు.  

Advertisement
Advertisement