అంతర్‌జిల్లా బైక్‌ల దొంగల అరెస్టు | Bike thieves arrested | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లా బైక్‌ల దొంగల అరెస్టు

Aug 11 2013 12:43 AM | Updated on Aug 21 2018 5:44 PM

వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లు దొంగిలించిన ఇద్దరు యువకులను ముదినేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరి చోరీ చేసిన 26 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ముదినేపల్లి, న్యూస్‌లైన్ : వివిధ ప్రాంతాల్లో మోటారు సైకిళ్లు దొంగిలించిన ఇద్దరు యువకులను ముదినేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరి చోరీ చేసిన 26 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై కె.ఈశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం సఖినేటిపల్లికి చెందిన ఏడిద సత్యనారాయణ(25), అనంతపురం పట్టణానికి చెందిన తోట సతీష్‌కుమార్ రెడ్డి(22) కలిసి మోటారు సైకిళ్లు దొంగిలిస్తుంటారు.
 
 సత్యనారాయణ ముదినేపల్లిలోనూ, సతీష్‌కుమార్‌రెడ్డి గుడివాడలో నివాసముంటున్నారు. వీరిద్దరూ కలిసి గుడివాడ, ముదినేపల్లి, విజయవాడ, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో మోటారు సైకిళ్లు దొంగిలిస్తూ పట్టుబడ్డారు. వాటిని మండలంలోని వివిధ గ్రామాల్లో అమ్మారు. విచారణ సందర్భంగా వీరు అందించిన సమాచారం ప్రకారం.. చోరీకి గురైన బైక్‌లు కొన్న 26 మంది నుంచి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. వీటి విలువ రూ.13 లక్షలు. సత్యనారాయణ హైదరాబాద్‌లో గతంలో జరిగిన ఓ హత్యకేసు లో నిందితుడని తేలింది.
 
 మండలంలోని పెదగొన్నూరు సర్పంచ్ లలితకుమారి స్థానికంగా నివా సం ఉంటున్నారు. ఈ నెల మూడో తేదీన ఆమె ఇంట్లో నగలు, నగదును సత్యనారాయణ దొం గిలించాడని పోలీసుల విచారణలో తేలింది. నిం దితులిద్దరూ వారం రోజుల క్రితమే పట్టుబడగా, గుడివాడ సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి దొంగతనాల వివరాలు రాబట్టినట్లు తెలిసింది.  సతీష్‌కుమార్‌రెడ్డి స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చదివాడని ఎస్సై పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement