లారీ ఢీకొని స్కూటరిస్ట్‌ దుర్మరణం | bike accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని స్కూటరిస్ట్‌ దుర్మరణం

Aug 29 2016 10:44 PM | Updated on Oct 20 2018 6:19 PM

ల్లూరు రూరల్‌ : బైక్‌పై రోడ్డు క్రాస్‌ చేస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన జాతీయరహదారిపై గొలగమూడి క్రాస్‌ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.

నెల్లూరు రూరల్‌ : బైక్‌పై రోడ్డు క్రాస్‌ చేస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం  పాలయ్యాడు. ఈ సంఘటన జాతీయరహదారిపై గొలగమూడి క్రాస్‌ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన హరీష్‌కుమార్‌(31) తన స్నేహితులతో కలిసి గొలగమూడి రోడ్డులోని ఓ దాబాలో ఆదివారం అర్ధరాత్రి భోజనం చేసి తన బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. జాతీయ రహదారిని దాటుతుండగా చెన్నై నుంచి కావలి వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మతి చెందాడు. సమాచారం అందుకున్న నెల్లూరురూరల్‌ ఎస్‌ఐ శేఖర్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement