భక్తి శ్రద్ధలతో ఊంజల్‌సేవ
శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏలూరు: శ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చన నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేశారు.
సాయంత్రం స్వామివారికి సహస్ర దీపార్చన నిర్వహించి, ఊంజల్ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి తీర్థ ప్రసాద వినియోగం చేశారు. ఆలయ అర్చకులు ఇల్లెందుల శ్రీనివాసాచార్యులు, కిళాంబి మారుతీ శ్రీనివాస రామానుజాచార్యులు విశేష పూజలు నిర్వహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి బీహెచ్‌వీఎస్‌ఎన్ కిషోర్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.