తొమ్మిది మంది పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు | best service medals to 9 policemen | Sakshi
Sakshi News home page

తొమ్మిది మంది పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

Aug 15 2016 12:31 AM | Updated on Sep 4 2017 9:17 AM

విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు వరంగల్‌ రూరల్‌ పోలీసు విభాగంలో పనిచేస్తున్న తొమ్మిది మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలు ప్రకటించిందని రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ ఒక ప్రకటనలో తెలిపారు.

వరంగల్‌ : విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు వరంగల్‌ రూరల్‌ పోలీసు విభాగంలో పనిచేస్తున్న తొమ్మిది మందికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలు ప్రకటించిందని రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝూ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ పతకాలను సోమవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. సీఐ వెంకటేశ్వరబాబు, ఆర్‌ఎస్‌ఐ శెట్టి శ్రీనివాస్, ఏఎస్‌ఐ కె.సుధాకర్, హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌రావు, ఏఆర్‌పీసీలు పెద్దిరెడ్డి, మిర్జాఖాన్‌బేగ్, ఎంఎ. షకూర్, ఎం.దుర్గాప్రసాద్, సివిల్‌ పీసీ సామల శ్రీనివాస్‌ ఈ అవార్డులు అందుకోనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement