మేడ్చల్ లో ‘బాల స్వస్థ’ ప్రారంభం | bala swastha opening in medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్ లో ‘బాల స్వస్థ’ ప్రారంభం

Jul 16 2016 3:16 AM | Updated on Mar 28 2018 11:26 AM

మేడ్చల్ లో ‘బాల స్వస్థ’ ప్రారంభం - Sakshi

మేడ్చల్ లో ‘బాల స్వస్థ’ ప్రారంభం

బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల స్వస్థ కార్యక్రమాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

మేడ్చల్: బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాల స్వస్థ కార్యక్రమాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ సెంటర్(సీహెచ్‌ఎన్‌సీ)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గ్రామాల్లోని పాఠశాలల పిల్లలు, అంగన్‌వాడీ చిన్నారులకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ప్రతీ సీహెచ్‌ఎన్‌సీకి రెండు వాహనాలు కేటారుుంచి.. దీనిలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఒక ఆయుష్ డాక్టర్, ఒక ఫార్మాసిస్ట్, ఒక ఏఎన్‌ఎంను నియమించనున్నట్లు తెలిపారు.

వీరంతా ఈ వాహనంలో గ్రామాలకు చిన్నారులకు పరీక్షలు చేసి అవసరమైన వైద్యం అందిస్తారని చెప్పారు. మేడ్చల్ సీహెచ్‌ఎన్‌సీకి రెండు వాహనాలు కేటారుుంచగా వాటి ద్వారా సీహెచ్‌ఎన్‌సీ పరిధిలో శ్రీరంగవరం, దుండిగల్, జవహర్‌నగర్, అల్వాల్, శామీర్‌పేట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సేవలందిస్తారని మండల వైద్యాకారి ఆనంద్ తెలిపారు. వైద్యులకు మెడికల్ కిట్లు అందజేసిన అనంతరం.. ఎమ్మెల్యే జెండా ఊపి  వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సభ్యురాలు శైలజ, ఎంపీపీ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైరన్ సత్యనారాయణ, ఎంపీడీఓ దేవసహయం, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భాస్కర్‌యాదవ్, టీఆర్‌ఎస్ నాయకులు విష్ణుచారి, నర్సింహారెడ్డి, రాఘవేందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement