సీఎంది శల్యసారథ్యం | babu as a follow up salya | Sakshi
Sakshi News home page

సీఎంది శల్యసారథ్యం

Jul 29 2016 11:41 PM | Updated on Mar 23 2019 9:10 PM

తిరుమల ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య - Sakshi

తిరుమల ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుది శల్య సారథ్యమని, ప్రత్యేక హోదా సాధించుకోవటంలో విఫలమయ్యారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు.

 
– సి.రామచంద్రయ్య ఎద్దేవా
సాక్షి, తిరుమల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుది శల్య సారథ్యమని, ప్రత్యేక హోదా సాధించుకోవటంలో విఫలమయ్యారని  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ  విభజన చట్టంలో ఇచ్చిన హామీని దక్కించుకోవటంలో ఏమాత్రం చొరవ చూపలేదన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు నామాల స్వామికి, అటు జనానికి నామాలు పెట్టేశారన్నారు. హోదా సాధనలో టీడీపీ చిత్తశుద్ధి లేకుండా డ్రామాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఏపీ సీఎంతోపాటు తెలంగాణ సీఎం జనం కష్టాలు మరచి సొంత ప్రయోజనాలకే ఎక్కువ చొరవ చూపటం బాధాకరమన్నారు. ఏపీ హోదా సాధన కోసం అందరూ కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలన్నీ విభేదాలు మరచి హోదా సాధన కోసం కృషి చేయాలని శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తెలిపారు.
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement