
ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాల ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకోని స్థానిక ప్రధాన వీధుల గుండా ఎరుుడ్‌స అవగాహన ర్యాలీ నిర్వహించారు.
బేల : మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాల ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకోని స్థానిక ప్రధాన వీధుల గుండా ఎరుుడ్‌స అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ కె. మోహన్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. అంతకుముందు ఎరుుడ్‌సపై నిర్వహించిన వ్యాసరచలన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి అందజేశారు.
నార్నూర్ : ఎయిడ్స్ రహిత సమాజ నిర్మానం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యుడు శ్రీనివాస్ అన్నారు. ఎయిడ్స్ డే సందర్బంగా గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాల నుంచి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూఎయిడ్స్ అంటువ్యాధి కాదన్నారు. మయాదారి రోగాల భారిన ఏవరు పడకుడదన్నారు. హెచ్‌ఐవీ సోకడానికి గల నాలుగు దశలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల వైఎస్ ప్రిన్సిపాల్ కాంబ్లె బాలాజీ, వైద్య శాఖ హెచ్‌ఈ నాందేవ్, సూపర్‌వైజర్ చరణ్‌దాస్, ఏఎన్‌ఎంలు సుశీల, శీల తదితరులు ఉన్నారు