ఆదోని మండలం 104 బసాపురం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త వీరేష్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు సుధాకర్, ప్రభాకర్, శేఖర్ దాడిచేసి గాయపరిచారు.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై దాడి
Jan 8 2017 12:33 AM | Updated on Aug 10 2018 8:23 PM
ఆదోని టౌన్: ఆదోని మండలం 104 బసాపురం గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త వీరేష్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు సుధాకర్, ప్రభాకర్, శేఖర్ దాడిచేసి గాయపరిచారు. బాధితుడిని కుటుంబీకులు ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. బాధితుడి తెలిపిన వివరాల మేరకు వీరేష్ వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని ముగించుకొని బైక్‌పై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకుని దాడి చేశారు. గ్రామంలోని బీసీ కాలనీలో రస్తా విషయంలో నెలకొన్న విభేదాల కారణంగానే దాడి చేశారు. ఈ మేరకు ఇస్వి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో టీడీపీ వర్గీయుల ఆగడాలు పెచ్చుమీరాయని విమర్శించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
Advertisement
Advertisement