అన్నదాన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి | aryavysyas anndhanam | Sakshi
Sakshi News home page

అన్నదాన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

Aug 7 2016 12:11 AM | Updated on Sep 4 2017 8:09 AM

కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీ అన్నారు.

రంగాపూర్‌(పెబ్బేరు):కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీ అన్నారు. శనివారం మండలంలోని రంగాపూర్‌ పుష్కరఘాట్‌ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమ పనులను ఆయన పరిశీలించారు. పుష్కర యాత్రికులకు అన్నదానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విషయాలను ఆయన స్థానిక నాయకులకు వివరించారు.  వంట షెడ్డుతో పాటు, భోజనశాల తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించి తగు సూచనలను చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు బుచ్చయ్య శెట్టి, నాయకులు బాలీశ్వరయ్య, హరినాథ్, జయప్రకాశ్‌ శెట్టి, రవి, సతీష్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement