న్యాయవాది వద్ద లొంగిపోవాలని యత్నిస్తుండగా అరెస్టు | Sakshi
Sakshi News home page

న్యాయవాది వద్ద లొంగిపోవాలని యత్నిస్తుండగా అరెస్టు

Published Mon, Jul 3 2017 11:31 PM

Arrested to surrender at the lawyer

కళ్యాణదుర్గం :

మండలం కామక్కపల్లి అటవీ ప్రాంతం వద్ద నిందితులు న్యాయవాది ద్వారా లొంగిపోవాలని ప్రయత్నిస్తుండగా సమాచారం అందడంతో సోమవారం డీఎస్పీ టీఎస్‌ వెంకటరమణ, సీఐ శివప్రసాద్‌ల సూచనలతో 15 మంది నిందితులను అరెస్టు చేసి, 9 ద్విచక్రవాహనాలు, 1 ఆటో, ప్లాస్టిక్‌ గంపలు, గడ్డపారలు, చెలికిపారలు, టార్చ్‌లైట్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐలు వివరించారు.

రామకృష్ణతో పాటు పెనుకొండ మండలం నగరూరు గ్రామానికి చెందిన వినోద్‌కుమార్, రొద్దం మండలం ఎం.కొత్తపల్లికి చెందిన  శివారెడ్డి, నల్లమాడ మండలం కోలంవాండ్లపల్లికి చెందిన రమణారెడ్డి, కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లికి చెందిన చంద్రశేఖర్, పరిగి మండలం సంగమేశనిపల్లికి చెందిన సతీష్‌కుమార్, పరిగి మండలం శాసనకోట గ్రామానికి చెందిన రామాంజినేయులు, అనంతపురానికి చెందిన దూదేకుల ఖలందర్, బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లికి చెందిన బోయ బసవరాజు, కంబదూరు మండలం మర్రిమాకులపల్లికి చెందిన పూజారి రామచంద్ర, భజంత్రీ సత్యనారాయణ, నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందిన నరసింహమూర్తి, బ్రహ్మసముద్రం మండలం మామడూరుకు చెందిన పూజారి గోవిందులను అరెస్టు చేశామని వివరించారు.

కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లికి చెందిన తిప్పేస్వామి అలియాస్‌ భవాని, అనంతపురం పట్టణానికి చెందిన రఘ, వడ్డే వెంకటేశ్, అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరుకు చెందిన సుబ్బరాయుడు పరారీలో ఉన్నారన్నారు. ఇదిలా ఉండగా గుప్తనిధుల ముఠా సభ్యుల నుంచి పట్టుబడ్డ ద్విచక్రవాహనాలపై పోలీసు స్టిక్కర్లు ఉన్నాయని, అయితే ఇందులో పోలీసుల పాత్ర ఏమీ లేదని విచారణలో తేలినట్లు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement