అంతర్జాతీయ విద్యుత్‌ సదస్సుకు ట్రాన్స్‌కో సీఈ | APSPDCL CE for international meet | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ విద్యుత్‌ సదస్సుకు ట్రాన్స్‌కో సీఈ

Oct 6 2016 1:28 AM | Updated on Oct 20 2018 6:19 PM

అంతర్జాతీయ విద్యుత్‌ సదస్సుకు ట్రాన్స్‌కో సీఈ - Sakshi

అంతర్జాతీయ విద్యుత్‌ సదస్సుకు ట్రాన్స్‌కో సీఈ

నెల్లూరు(అర్బన్‌) : పరిశ్రమల సమాఖ్య, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆ రాష్ట్రంలోని వడోదర పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ విద్యుత్‌ సాంకేతిక సదస్సుకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ నుంచి సీఈ కె.నందకుమార్‌ హాజరు కానున్నారు.

నెల్లూరు(అర్బన్‌) : పరిశ్రమల సమాఖ్య, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆ రాష్ట్రంలోని వడోదర పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ విద్యుత్‌ సాంకేతిక సదస్సుకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ నుంచి సీఈ కె.నందకుమార్‌ హాజరు కానున్నారు. ఈ సదస్సులో వివిధ దేశాల విద్యుత్‌ శాఖ మంత్రులు, నిపుణులు, విద్యుత్‌ కంపెనీల ప్రతినిధులు, పరిశ్రమల అధినేతలు పాల్గొంటారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై చర్చ జరుగుతుందని వివరించారు. పర్యావరణానికి హాని కలుగకుండా తక్కువ ఖర్చుతో విద్యుదుత్పత్తి, సంప్రదాయేతర ఇందన వనరులను ప్రోత్సహించడం, పాత విద్యుత్‌ ప్రాజెక్టులను ఆధునీకరించడం లాంటి అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement