ఏఎన్‌యూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌ | ANU Professor got Doctorate | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

Sep 20 2016 4:19 PM | Updated on Sep 4 2017 2:16 PM

ఏఎన్‌యూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

ఏఎన్‌యూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంగ్లీష్‌ విభాగ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జి. చెన్నారెడ్డికి ఆంధ్రా యూనివర్సిటీ ఇటీవల పీహెచ్‌డీ డాక్టర్‌రేట్‌ను ప్రధానం చేసింది.

ఏఎన్‌యూ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంగ్లీష్‌ విభాగ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జి. చెన్నారెడ్డికి ఆంధ్రా యూనివర్సిటీ ఇటీవల పీహెచ్‌డీ డాక్టర్‌రేట్‌ను ప్రధానం చేసింది. రెండో పీహెచ్‌డీని అందుకున్న డాక్టర్‌ జి. చెన్నారెడ్డిని సోమవారం వీసీ ఆచార్య ఎ. రాజేంద్రప్రసాద్, యూనివర్సిటీ అధికారులు అభినందించారు. రెండు పీహెచ్‌డీలు చేసిన డాక్టర్‌ చెన్నారెడ్డి అధ్యాపకులకు, పరి శోధకులకు ఆదర్శమని వీసీ పేర్కొన్నారు. గతంలో ఇంగ్లీష్‌లో పీహెచ్‌డీ చేసి 2006లో ఏఎన్‌యూ ఇంగ్లీష్‌ విభాగంలో రెగ్యులర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరిన డాక్టర్‌ చెన్నారెడ్డి తరువాత ఆంధ్రాయూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ విభాగంలో ఆచార్య నిమ్మా వెంకటరావు పర్యవేక్షణక్షలో ‘ఉత్తరాంధ్రలో బీఈడీ కళాశాలల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల ఆంగ్లభాషా నైపుణ్యం ’ అనే అంశంపై ఇటీవల పీహెచ్‌డీ గ్రంథాన్ని సమర్పించారు.  డాక్టర్‌ చెన్నారెడ్డి పర్యవేక్షణలో ఇప్పటి వరకు ఇంగ్లీష్‌ విభాగంలో 8 పీహెచ్‌డీలు, 25 ఎంఫిల్‌లు ప్రదానం చేయబడ్డాయి, 40 అంతర్జాతీయ, 25 జాతీయ స్థాయి జర్నల్స్‌లో ఆయన పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. 2007 నుంచి 2009 వరకు డాక్టర్‌ చెన్నారెడ్డి ఏఎన్‌యూ జర్నలిజం విభాగానికి కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా జర్నలిజం డిపాట్‌మెంట్‌ అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement