కర్నూలు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలి | AndhraPradesh farmers sang members takes on tdp govt | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలి

Aug 16 2015 11:11 AM | Updated on Jun 2 2018 5:56 PM

కర్నూలు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

కర్నూలు : కర్నూలు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కర్నూలు జిల్లాలోని దేవనకొండ, కరివేమల, కలిడికొండ గ్రామాల్లోని పంట పొలాలు  ఏపీ రైతు సంఘం సభ్యులు పరిశీలించారు. చెరువులను నీటితో నింపి రైతులకు సాగు నీరు అందించాలని రైతు సంఘం సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ కూలీలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జగన్నాథం ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement