చదువుకు సాయం | Andhra Pradesh Brahman Welfare Corporation by Bharti Education Scheme to Online applications | Sakshi
Sakshi News home page

చదువుకు సాయం

Jul 6 2016 2:34 AM | Updated on Sep 4 2017 4:11 AM

చదువుకు సాయం

చదువుకు సాయం

నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోవడానికి ఓ సాయం అందుబాటులో ఉంది. బ్రాహ్మణ విద్యార్థుల విద్యాభ్యాసానికి...

శ్రీకాకుళం: నిరుపేద బ్రాహ్మణ విద్యార్థులు చదువుకోవడానికి ఓ సాయం అందుబాటులో ఉంది. బ్రాహ్మణ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ (ఏబీసీ) లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘భారతీ విద్యా పథకం’ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు ఏటా ఈ పథకం లో నగదు ప్రోత్సాహకం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.
 
అర్హతలు...
విద్యార్థి తల్లిదండ్రులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నివాసితులై ఉండాలి.
1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అనాథ పిల్లలు లేదా తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న వారు మాత్రమే అర్హులు.
దరఖాస్తుదారులు ప్రభుత్వ గుర్తింపు గల సంస్థల్లో చదువుతూ ఉండాలి.
తల్లితండ్రులు/సంరక్షకుని వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉండాలి.
2016-17 సంవత్సరంలో పాఠశాల/కళాశాల/ఇన్‌స్టిట్యూట్/ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండాలి.
ముందు సంవత్సరంలోని చదువు లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులై ఉండాలి.
విద్యార్థి ఇతర ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి లబ్ధి పొంది ఉండరాదు. అయితే అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు మాత్రం ఈ పథకానికి కూడా అర్హులే.
 
దరఖాస్తు చేసుకోండిలా..
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో www.and-h-ra-bra-h-m-in.ap.go-v.in  వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 30లోపు పొందుపర్చాలి. సమాచారం కోసం టోల్‌ఫ్రీ నం : 1800 102 3579లో సంప్రదించవచ్చు.
దరఖాస్తుతోపాటు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
ఒక్కొక్కటీ 250 కేబీ లోపు పీడీఎఫ్ ఫార్మెట్‌లో ఉండాలి. ఏ కోర్సుకు దరఖాస్తుతోపాటు ఏయే ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలో ఏబీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
విద్యార్థి రాష్ట్రంలో చదివితే ఆంధ్రాబ్యాంకు ఖాతా, రాష్ట్రం వెలుపల చదివితే ఏ జాతీయ బ్యాంక్ ఖాతా అయినా తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక విధానంలో అనాథ, ఒంటరి తల్లి, శారీరక వైకల్యం, బాలిక, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత క్రమం పాటిస్తారు. నిర్ణీత మొత్తాన్ని ఒకే దఫాగా ఎంపిక చేసిన విద్యార్థుల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement