నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో సోమవారం హైలెవల్ కెనాల్ పనులు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహం బయట పడింది.
కాలువ పనుల్లో పురాతన విగ్రహం లభ్యం
Jul 25 2016 11:01 AM | Updated on Jun 2 2018 7:27 PM
మర్రిపాడు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో సోమవారం హైలెవల్ కెనాల్ పనులు నిర్వహిస్తుండగా పురాతన విగ్రహం బయట పడింది. సోమశిల ప్రాజెక్ట్ కాలువ పనులు నిర్వహిస్తున్న సమయంలో చెన్నకేశవ స్వామి విగ్రహం కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని కాలువ పనులను అడ్డుకున్నారు. ఆలయ నిర్మాణం చేపట్టిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పురాతన శివాలయం, గంగమ్మగుడి, పోలేరమ్మ గుడి ఉండటంతో తవ్వకాలు జరిపితే మరికొన్ని విగ్రహాలు బయటపడే అవకాశం ఉండొచ్చని గ్రామస్థులు అంటున్నారు.
Advertisement
Advertisement