హాకీ ఫైనల్స్‌లో అనంత, వైఎస్సార్‌ జట్లు | anantha and ysr teams on finals of hockey | Sakshi
Sakshi News home page

హాకీ ఫైనల్స్‌లో అనంత, వైఎస్సార్‌ జట్లు

Oct 16 2016 11:19 PM | Updated on Jun 4 2019 5:58 PM

హాకీ ఫైనల్స్‌లో అనంత, వైఎస్సార్‌ జట్లు - Sakshi

హాకీ ఫైనల్స్‌లో అనంత, వైఎస్సార్‌ జట్లు

అండర్‌–19 హాకీ టోర్నీ ఫైనల్స్‌లోకి అనంత, వైఎస్సార్‌ జిల్లా జట్లు దూసుకెళ్లాయి.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అండర్‌–19 హాకీ టోర్నీ ఫైనల్స్‌లోకి అనంత, వైఎస్సార్‌ జిల్లా జట్లు దూసుకెళ్లాయి. ఆదివారం నగరంలోని ఆర్ట్స్‌కాలేజీ, బాలుర ఉన్నత పాఠశాల మైదానాల్లో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచులు రసవత్తరంగా సాగాయి.  అనంత బాలికల జట్టు.. పశ్చిమగోదావరి జట్టుపై 7–0తో విజయం సాధించింది. అనంత జట్టు లో జ్యోతి–4, మహేశ్వరి–2, వాణి–1 గోల్స్‌ చేసి జట్టును విజయ తీరానికి చేర్చారు. మరో సెమీఫైనల్‌ లో చిత్తూరు జట్టును వైఎస్సార్‌ జిల్లా జట్టు 1–0తో ఓడించింది. వైఎస్సార్‌ జిల్లా జట్టులోని సౌజన్య–1 గోల్‌ చేసింది. సోమవారం అనంత, వైఎస్సార్‌ జిల్లా జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఇక... బాలుర  క్వార్టర్‌ ఫైనల్స్‌లో నెల్లూరును విశాఖపట్టణం జట్టు 3– 0తో ఓడించింది.

విశాఖ జట్టులో అభిషేక్‌–2, హరీష్‌–1 గోల్స్‌ చేశారు. ఇక కృష్ణా, కర్నూలు జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ మొదట టై కాగా... స్ట్రోక్స్‌లో 3–2 తేడాతో కర్నూలు జట్టు విజయం సాధించింది. కర్నూలు జట్టులో యువరాజు–1, హర్షవర్ధన్‌ రెడ్డి–1, సునీల్‌–1 గోల్స్‌ చేశారు. వైయస్సార్‌ జిల్లా జట్టును అనంత జట్టు 1–0తో ఓడించింది. అనంత జట్టులో భాస్కర్‌–1 గోల్‌ సాధించాడు. విజయనగరం జట్టును చిత్తూరు జట్టు 1–0తో ఓడించింది. చిత్తూరు జట్టు లోని సూరి–1 గోల్‌ను సాధించాడు.

నేడు బాలికల ఫైనల్స్‌
బాలికల విభాగంలో అనంతపురం,వైయస్సార్‌ జిల్లా జట్లు సోమవారం తలపడనున్నాయి. అలాగే బాలుర సెమీఫైనల్స్‌లో విశాఖపట్టణం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జట్లు తలపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement