కలకలం | alert with nayeem encounter | Sakshi
Sakshi News home page

కలకలం

Aug 8 2016 11:32 PM | Updated on Sep 4 2017 8:25 AM

కలకలం

కలకలం

గ్యాంగ్‌స్టర్‌ నయీమెుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ జిల్లాలో కలకలం రేపింది. నయీం ముఠా గతంలో జిల్లాలోనూ సెటిల్‌మెంట్లు చేసినట్టు చర్చ జరుగుతోంది. నయీం స్వస్థలమైన నల్లగొండ జిల్లా భువనగిరి మన జిల్లాకు సమీప ప్రాంతం కావడంతో ముఠా సభ్యులు ఇక్కడ కూడా తమ కార్యకలాపాలు సాగించినట్టు తెలుస్తోంది. అయితే ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసులు నమోదు కాలేదు.

  • నయీం  ఎన్‌కౌంటర్‌తో రియల్టర్లలో గుబులు
  • రహస్య ప్రాంతాలకు వెళ్లేందుకు సమాయత్తం?
  • వరంగల్‌ : గ్యాంగ్‌స్టర్‌ నయీమెుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ జిల్లాలో కలకలం రేపింది. నయీం  ముఠా గతంలో జిల్లాలోనూ సెటిల్‌మెంట్లు చేసినట్టు చర్చ జరుగుతోంది. నయీం  స్వస్థలమైన నల్లగొండ జిల్లా భువనగిరి మన జిల్లాకు సమీప ప్రాంతం కావడంతో ముఠా సభ్యులు ఇక్కడ కూడా తమ కార్యకలాపాలు సాగించినట్టు తెలుస్తోంది. అయితే ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసులు నమోదు కాలేదు.
     
    నయీం గ్యాంగ్‌తో జిల్లాకు చెందిన కొందరు రియల్టర్లకు సుదీర్ఘకాలంగా సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా నోరు మెదపడం లేదు. నయీం  ఎన్‌కౌంటర్‌ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సమాచారం మేరకు పక్క జిల్లాల్లో అరెస్టులు ప్రారంభం కావడంతో నయీంతో సంబంధాలున్న వారు రహస్య ప్రదేశాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నటు తెలిసింది. నయీంతో యాదగిరిగుట్టకు చెందిన కొందరితో సంబంధం ఉన్నట్లు సోషల్‌ మీడియాలో రావడంతో ఆ ప్రాంతంలో భూ క్రయ విక్రయాలు చేసిన మన జిల్లాకు చెందిన పలువురు ఆందోళనలకు గురువుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement