మర్రిపాడు : మండలంలోని నందవరంలో నూతనంగా నిర్మించిన మోడల్ పాఠశాలలో సోమవారం నుంచి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శారదకుమారి తెలిపారు.
మోడల్ స్కూల్‌లో నేటి నుంచి ప్రవేశాలు
Jul 17 2016 11:45 PM | Updated on Aug 17 2018 3:08 PM
మర్రిపాడు : మండలంలోని నందవరంలో నూతనంగా నిర్మించిన మోడల్ పాఠశాలలో సోమవారం నుంచి ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శారదకుమారి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ స్కూల్‌లో ప్రవేశాల కోసం ఇటీవల ప్రవేశపరీక్ష నిర్వహించామన్నారు. అందులో ఉత్తీర్ణులైన విద్యార్థుల జాబితాను ప్రచురించామని చెప్పారు. జాబితాలో పేర్లు ఉన్న విద్యార్థులు తమ టీసీలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులను సోమవారం నుంచి బుధవారం లోగా అందచేయాలని సూచించారు. అలాగే మోడల్‌స్కూల్‌లో ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 21వ తేదీన జరిగే డెమో తరగతులకు హాజరుకావాలన్నారు. అదే రోజున ఉపాధ్యాయుల ఎంపిక కూడా జరుగుతుందని తెలియజేశారు.
Advertisement
Advertisement