ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు | action for not follow rules | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు

Jan 22 2017 12:27 AM | Updated on Sep 5 2017 1:46 AM

గనులు, ఫ్యాక్టరీల యజమానులు కార్మికుల విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జీయాలజీశాఖ బళ్లారి రీజియన్‌ డీఎంఎస్‌ మనీష్‌ మూర్కూటే అన్నారు.

- డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జూవాలజీశాఖ బళ్లారి రీజియన్‌ డీఎంఎస్‌ 
 
డోన్‌ టౌన్‌ : గనులు, ఫ్యాక్టరీల యజమానులు కార్మికుల విషయంలో  ప్రభుత్వ నిబంధనలు పాటించాలని  లేకపోతే కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జీయాలజీశాఖ బళ్లారి రీజియన్‌ డీఎంఎస్‌ మనీష్‌ మూర్కూటే అన్నారు. గనుల భద్రతా వారోత్సవాల సందర్భంగా డోన్‌ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పనులు చేసేటప్పుడు కార్మికులకు  ప్రమాదాలు జరిగితే కొందరు యజమానులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. అనంతరం భద్రతా చర్యలను చేపట్టిన గనుల యజమానులకు   ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.  కార్యక్రమంలో డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ బళ్లారి రీజియన్‌ డీఎంఎస్‌ఎస్‌లు తిరుపతి, నాగేశ్వరరావు, కర్నూలు జిల్లా డీడీ రాజబాబు, వీటీసీ అధికారి చంద్రశేఖర్, జిందాల్‌ అధికారి సునీల్‌ కుమార్‌ సింగ్, పారిశ్రామిక వేత్తలు ఐపీ శ్రీరాములు, సుజాత శర్మ, ఎన్‌ఎం మధు, తెనాలి రమేష్‌, ల క్ష్మీనారాయణ యాదవ్, రామ్మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement