మళ్లీ కదులుతోంది | Accused filed case against to banks | Sakshi
Sakshi News home page

మళ్లీ కదులుతోంది

Mar 31 2017 3:06 PM | Updated on Sep 5 2017 7:35 AM

మళ్లీ కదులుతోంది

మళ్లీ కదులుతోంది

స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని కరూర్‌ వైశ్యాబ్యాంకులో నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

► తెరపైకి నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం
► కోర్టును ఆశ్రయించిన నిందితులు, బ్యాంకర్లపై ఫిర్యాదు


రాజాం: స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని కరూర్‌ వైశ్యాబ్యాంకులో నకిలీ బంగారంపై రుణాలు పొందిన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నకిలీ బంగారం తాకట్టుపెట్టి రుణాలు పొందిన ఘటన వారం రోజుల క్రితం కలకలం రేపగా బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటు రాజాం కోర్టుకు కేసును అప్పగించారు. ఈ లోగా నిందితుల్లోని ఓ వ్యక్తి రాజాం కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. బ్యాంకు అధికారులు, పోలీసులు రుణాలు చెల్లించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

ఈ మేరకు కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో రాజాం సీఐ శంకరరావుతో పాటు సిబ్బంది గురువారం కరూర్‌ వైశ్యాబ్యాంకుకు చేరుకొని మళ్లీ దర్యాప్తు నిర్వహించినట్టు తెలిసింది. అయితే పోలీసులు గాని, బ్యాంకు అధికారులు గాని ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. మరోవైపు ఇప్పటికీ బ్యాంకులో రుణాలు కోసం బంగారం తాకట్టుపెట్టిన ఖాతాదారులు విడిపించుకునేందుకు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement