అవినీతి ఆరోపణల నేపథ్యంలో కర్నూలు డీఎంఅండ్‌హెచ్‌వో స్వరాజ్యలక్ష్మి ఇంట్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
స్థానిక సప్తగిరినగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు చేపట్టిన అధికారులు స్వరాజ్యలక్ష్మి పాస్‌పోర్టును, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు విశాఖ, విజయనగరాల్లోనూ దాడులు చేస్తున్నట్లు సమాచారం. డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేపట్టారు.